Skip to main content

మే 17, 18 తేదీల ‘ఇంటర్’ షెడ్యూల్ మార్పు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మే 17, 18 తేదీల్లో జరగనున్న ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి.
ఆయా తేదీల్లో డీసెట్ (డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎగ్జామినేషన్ టెస్ట్) జరగనుండటంతో వాటికి ఇబ్బంది రాకుండా పరీక్షలను మే 23, 24 తేదీల్లో నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, డీసెట్ పరీక్షలు ఒకే తేదీల్లో వస్తున్నాయని మే 15న ‘సాక్షి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో పరీక్షలను మే 23, 24వ తేదీల్లోకి మార్పు చేస్తున్నట్లు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే మే 30న ఎథిక్స్ అండ్ హ్యూమన్‌వేల్యూస్, 31న ఎన్విరాన్మెంటల్ పరీక్షలుంటాయని మంత్రి చెప్పారు. మే 23 నుంచి 27వరకు జరగాల్సిన ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు 25 నుంచి 29వరకు జరుగుతాయని గంటా వివరించారు. అలాగే మే 19, 21, 22వ తేదీల్లో నిర్వహించే పరీక్షలు యథావిధిగా చేపట్టనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో డీసెట్‌ను యథావిధిగా నిర్వహించనున్నారు.
Published date : 16 May 2018 02:10PM

Photo Stories