మార్చి 31 లోగా ఫీజు చెల్లించాలి...
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: అడ్వాన్‌సడ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే ప్రైవేటు (రెగ్యులర్‌గా కాలేజీలో చదవనివారు) అభ్యర్థులు మార్చి 31లోగా హాజరు మినహాయింపు ఫీజు చెల్లించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆర్‌ట్స, హ్యుమానిటీస్ సబ్జెక్టులకు మే, జూన్‌లలో జరిగే పరీక్షలకు హాజరు మినహాయింపు ఫీజు రూ.500 చెల్లించాలని పేర్కొన్నారు. పదోతరగతి పాసైన తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ ఉంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు, రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ పరీక్షలకు అర్హులని తెలిపారు. అలాగే సెకండియర్ ఫెయిలైన అభ్యర్థులు వాళ్ల గ్రూపును లేదా ఆప్షనల్ సబ్జెక్టులను మార్చుకున్న వారు కూడా అర్హులని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పాసైన అభ్యర్థులు సెకండ్ లాంగ్వేజ్‌ను అడిషనల్ సబ్జెక్టుగా, అలాగే బైపీసీ చదివిన వాళ్లు అడిషనల్ సబ్జెక్టుగా మేథమేటిక్స్‌ను కూడా చేర్చుకోవచ్చని తెలిపారు. అటెండెన్‌స మినహాయింపు ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలనుకునే అభ్యర్థులు bie.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా పదోతరగతి ఒరిజినల్ సర్టిఫికెట్, టీసీ, మైగ్రేషన్ సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.
Published date : 20 Mar 2019 02:27PM