మార్చి 13న యథావిధిగా ఇంటర్ పరీక్షలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మార్చి 13వ తేదీన జరగనున్న ఇంటర్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, వాటి నిర్వహణకు అందరూ సహకరించాలని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు మార్చి 8న ఒక ప్రకటనలో కోరింది.
మార్చి 13వ తేదీన ఎమ్మార్పీఎస్ బంద్‌కు పిలుపునిచ్చినా.. పరీక్షలను వాయిదా వేసే పరిస్థితి లేదని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 13న 1,294 కేంద్రాల్లో కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పరీక్షలను వాయిదా వేస్తే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని, ఆ ప్రభావం నీట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్‌సడ్ పరీక్షలపై పడుతుందని వివరించింది. ఈ నేపథ్యంలో 13వ తేదీ నాటి పరీక్షలకు ఎమ్మార్పీఎస్ కూడా సహకరించాలని కోరింది.
Published date : 09 Mar 2018 01:29PM