కూలీ కొడుకు...జేఈఈలో మెరిశాడు
Sakshi Education
కోట: కొన్నేళ్ల కిందటి వరకు లేఖ్‌రాజ్ భీల్ జేఈఈ మెయిన్ పరీక్ష గురించి విని ఉండడు. అలాంటిది ఈ ఏడాది జేఈఈ మెయిన్‌లో మంచి ర్యాంకు సాధించి రికార్డు సృష్టించాడు.
రాజస్తాన్‌లోని ఓ గిరిజన గ్రామానికి చెందిన మొదటి ఇంజనీర్‌గా లేఖ్‌రాజ్ ఘనత సాధించనున్నారు. లేఖ్‌రాజ్ తల్లిదండ్రులు మంగీలాల్, సర్దారీ భాయ్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎమ్‌ఎన్‌ఆర్‌ఈజీఏ) కింద పని చేసే రోజువారీ కూలీలు. ‘నాకు ఇంజనీర్ అంటే ఏంటో తెలీదు. నా కొడుకు డిగ్రీ చదువుతాడని నేను కలలో కూడా అనుకోలేదు. మా గ్రామం నుంచి భీల్ వర్గం నుంచి ఇంజనీర్ అవుతున్న మొదటి వ్యక్తి నా కొడుకు కావడంతో నా ఆనందానికి అవధుల్లేవు’అని చమర్చిన కళ్లతో లేఖ్‌రాజ్ తండ్రి మంగీలాల్ అన్నారు. తమ కుటుంబ పరిస్థితి లేఖ్‌రాజ్‌తో చక్కదిద్దుకుంటుందనే నమ్మకం ఉందని తెలిపారు. తమ గ్రామంలో చదువుకోకుండా కూలీలుగా మిగిలిపోతున్న వారికి చదువు విలువను నేర్పాలనుకుంటున్నట్లు లేఖ్‌రాజ్ తెలిపారు.
Published date : 25 Jun 2019 02:34PM