Skip to main content

కొత్త సెట్స్‌తో ఇంటర్ పరీక్షలు

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం వరంగల్‌లోని పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నపత్రాలు భద్రపరిచిన రెండు బాక్సులు మిస్ అయిన నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది.
జూన్ 7 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్న తరుణంలో ప్రశ్నపత్రాల ట్రంకు బాక్సులు మిస్ అయినట్లు తమకు ప్రాథమిక నివేదిక అందినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త సెట్స్‌తోనే పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బోర్డు కార్యదర్శి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.
Published date : 06 Jun 2019 03:42PM

Photo Stories