కోవిడ్ నేపథ్యంలో నిబంధనల సడలింపు: జేఈఈ అడ్వాన్‌స, మెరుున్ అర్హతతో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన నిబంధనల నుంచి అభ్యర్థులకు ఈసారి కొంత ఊరట లభిస్తోంది.
ఈ సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియలో పాల్గొనాలంటే జేఈఈ మెరుున్, అడ్వాన్‌స పరీక్షల్లో అర్హత సాధించడంతో పాటు ఇంటర్మీడియెట్‌లో 75 % మార్కులు లేదా జేఈఈలో టాప్ 20 పర్సంటైల్ సాధించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు ఈ నిబంధన నుంచి కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చింది.
కోవిడ్ నేపథ్యంలో మినహారుుంపు
- కోవిడ్-19 నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. విద్యార్థులు కూడా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
- దీంతో ఈ నిబంధన నుంచి మినహారుుంపు ఇస్తూ.. జేఈఈలో అర్హత సాధించి మెరిట్‌లో ఉన్న అభ్యర్థులకు ఆయా సంస్థల్లో సీట్లు కేటారుుంచాలని నిర్ణరుుంచారు.
- ఐఐటీల్లో సీట్లకు జేఈఈ అడ్వాన్‌సలో.. ఇతర సంస్థల్లో సీట్లు పొందేందుకు జేఈఈ మెరుున్‌లో మెరిట్ సాధించి ఉండాలి.
- ఈసారి కోవిడ్ కారణంగా అభ్యర్థులు ఆయా సంస్థల్లో చేరేందుకు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ చేయవచ్చు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మాత్రం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు
- జేఈఈ అడ్వాన్‌స పరీక్ష 27న జరగనున్న నేపథ్యంలో ఐఐటీ న్యూఢిల్లీ సోమవారం నుంచి అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
- అడ్మిట్ కార్డులో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, ఫొటో, సంతకం, పుట్టిన తేదీ, చిరునామా, సామాజిక వర్గం సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.
- ఈ ఏడాది మొత్తం 2.50 లక్షల మంది అర్హత సాధించినా కేవలం 1,60,864 మందే పరీక్షకు హాజరయ్యేందుకు నమోదు చేసుకున్నారు.
222 నగరాల్లోని 1,150 కేంద్రాల్లో...
- ఫలితాలు అక్టోబర్ 5న విడుదలవుతారుు. అక్టోబర్ 6 నుంచి జారుుంట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించనుంది.
- ఈసారి కౌన్సెలింగ్ ప్రక్రియను 7కు బదులు 6 విడతల్లోనే ముగిస్తారు. అభ్యర్థులకు అవగాహన కోసం 2 విడతల మాక్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
- ఐఐటీలతో పాటుగా జేఈఈ అడ్వాన్‌స ర్యాంక్‌తో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్‌స, బర్హంపూర్, భోపాల్, కోల్‌కతా, మొహాలి, పూనే, తిరువనంతపురం, తిరుపతిలలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్‌స ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- తిరువనంతపురంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్‌స అండ్ టెక్నాలజీ, రాయబరేలీలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, విశాఖలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సంస్థల్లో ప్రవేశాలకూ దరఖాస్తు చేసుకోవచ్చు.
Published date : 22 Sep 2020 01:24PM