జూనియర్ కళాశాలలకూ..విద్యా పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్వర్తింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తూ దోపిడీ సాగిస్తున్న ప్రైవేటు జూనియర్ కళాశాలల ఆటలు ఇకపై సాగవు.
ఇలాంటి కాలేజీలపై చర్యలు తీసుకునే అధికారాన్ని పాఠశాల విద్యా పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌కు కల్పిస్తూ ప్రభుత్వం డిసెంబర్ 10నశాసనసభలో సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పాఠశాల విద్య క్రమబద్ధీకరణ, పర్యవేక్షణ కమిషన్ చట్టం-2019 పేరుతో ప్రభుత్వం ఇప్పటికే చట్టాన్ని చేయడం తెలిసిందే. ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. పాఠశాలల్లో విద్యాప్రమాణాల నిర్వహణ, ఫీజుల క్రమబద్ధీకరణ, ఉపాధ్యాయుల అర్హత, పాఠశాలల తనిఖీ, పర్యవేక్షణ చేపట్టేలా కమిషన్‌కు ఈ చట్టం అధికారాన్ని కల్పించింది. అరుుతే కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారం ఫీజులను పెంచు కుంటూ పోతున్న నేపథ్యంలో.. జూనియర్ కాలే జీల్లోనూ అధిక ఫీజుల వసూలును నియంత్రిం చేందుకు కమిషన్ పరిధిని ఇంటర్ వరకు విస్తరింపచేయాలని ప్రభుత్వం అప్పట్లోనే ప్రతిపాదించింది. అరుుతే అప్పటికే శాసనసభ ప్రొరోగ్ అవడంతో అక్టోబర్ 30న రాష్ట్ర గవర్నర్ ఆ చట్టానికి సవరణ ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాల స్థానంలో ప్రభుత్వం తాజా సవరణ బిల్లును ప్రస్తుతం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గతంలో ‘సెకండరీ విద్య’ వరకు మాత్రమే వర్తించేలా ఈ చట్టంలో నిబంధనలు పొందుపర్చగా డిసెంబర్ 10న ప్రవేశపెట్టిన సవరణ బిల్లులో ఇంటర్మీడియెట్ విద్యను చేర్చింది.
Published date : 11 Dec 2019 02:20PM