జూనియర్ కాలేజీలుగా 84 కేజీబీవీల అప్‌గ్రేడేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో 84 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను (కేజేబీవీ) ప్రభుత్వం జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసింది.
ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి జూన్ 28న ఉత్తర్వులు జారీ చేశారు. వాటిలో ఈ విద్యా సంవత్సరం 11వ తరగతిలో, వచ్చే ఏడాది 12వ తరగతిలో ప్రవేశాలు చేపట్టనున్నారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో ప్రారంభించే ఈ కాలేజీల్లో ప్రతిసెక్షన్‌లో 40 మంది విద్యార్థినులకు అవకాశం కల్పిస్తారు.
Published date : 29 Jun 2019 04:42PM