Skip to main content

జూనియర్ కాలేజీలుగా 11 గిరిజన గురుకులాలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 11 గురుకుల పాఠశాలలకు జూనియర్ కాలేజీ హోదా కల్పిస్తూ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్నూర్ మహేశ్‌దత్ ఎక్కా మే 11న ఉత్తర్వులు జారీ చేశారు.
ఇకపై ఈ గురుకులాల్లో 5 నుంచి 12వ తరగతి వరకు తరగతులు కొనసాగనున్నాయి. అప్‌గ్రేడ్ అయిన వాటిలో మరిపెడ, కాటారం, కెరమెరి, ఇచ్చోడ, పెదమందాడి, కొండాపూర్, దామరవంచ, వరంగల్, చేగుంట, జిన్నారం, దేవరకొండ గురుకుల పాఠశాలలున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు తీసుకోనున్నారు.
Published date : 12 May 2018 04:39PM

Photo Stories