జూనియర్ కాలేజీల్లో బయోమెట్రిక్ తప్పనిసరి
Sakshi Education
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలలోనే కాకుండా అన్ని ప్రైవేట్, ఇతర యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లోని బోధన, బోధనేతర సిబ్బంది రోజువారీ హాజరును బయోమెట్రిక్ యంత్రాల ద్వారా నమోదు చేయించాలని ఇంటర్ విద్యామండలి ఆదేశించింది.
మండలి కార్యదర్శి బి.ఉదయలక్ష్మి జూన్ 30న ఉత్తర్వులు జారీచేశారు. ఆధార్‌తో కూడిన ఈ హాజరు ‘విద్యావాన్’ అనే వెబ్‌సైట్‌తో అనుసంధానం కావాలని సూచించారు. ప్రస్తుతం ఇంటర్ కాలేజీల్లో, ప్రభుత్వ కాలేజీల వరకు బయోమెట్రిక్ హాజరు కొంతమేర అమలవుతున్నా ప్రైవేట్ కాలేజీల్లో పట్టించుకోవడం లేదు. వీరు తప్పనిసరిగా స్కాలర్‌షిప్పులు విద్యార్థులకు అందడానికి వీలుగా వారి వివరాలను, హాజరును బయోమెట్రిక్ యంత్రాల ద్వారా జ్ఞానభూమి వెబ్‌సైట్లో నమోదు చేయాల్సి ఉన్నా దానినీ పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది నుంచి తప్పనిసరిగా అన్ని కాలేజీల వారూ బయోమెట్రిక్ హాజరును, జ్ఞానభూమిలో విద్యార్థుల సమాచారాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్‌విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు జూలై ఆరంభం నుంచి మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నట్లు కమిషనర్ వివరించారు. ప్రస్తుతానికి సమీపంలోని హైస్కూళ్లలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్న సంస్థలకే ఈ కాలేజీల్లో భోజన బాధ్యతలను అప్పగించనున్నారు. ఇటీవల అనంతపురంలోని జూనియర్ కాలేజీలను సందర్శించినప్పుడు అక్కడికి దూరప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులు తమకు మధ్యాహ్న భోజనం గురించి కమిషనర్‌కు విన్నవించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఆమోదం తెలపడంతోపాటు అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపు కావడంతో ఈ ఏడాది నుంచే భోజన ఏర్పాట్లకు అధికారులు శ్రీకారం చుట్టారు.
జిల్లాకొక అకడమిక్ ఎక్సలెన్సీ కాలేజీ :
జాతీయస్థాయి అత్యున్నత విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుగుణంగా ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులనూ తీర్చిదిద్దడానికి అకడమిక్ ఎక్సలెన్సీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జిల్లాకొక ప్రభుత్వ కాలేజీని ఎంపిక చేసి అందులో జేఈఈ, నీట్, ఎంసెట్ తదితర పోటీ పరీక్షలకు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. పెలైట్ ప్రాజెక్టు కింద ఈ కాలేజీలను జిల్లాకొకటి చొప్పున ఎంపికచేసి ప్రత్యేక శిక్షణకు వీలుగా మైక్రో షెడ్యూల్‌ను అమలుచేస్తారు.
రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలు విడుదల :
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసిన విద్యార్థుల ఫలితాలు విడుదలయ్యాయి. https://jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్‌లో ఈ ఫలితాలను పొందుపరిచారు.

Published date : 02 Jul 2018 03:03PM