జూనియర్ కాలేజీలకు జనవరి 14,15న సంక్రాంతి సెలవులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు జనవరి 14, 15 తేదీలను సంక్రాంతి సెలవులుగా ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు వీటిని అమలు చేయాలని పేర్కొంది. 12వ తేదీన రెండో శనివారం, 13న ఆదివారం కావడంతో కాలేజీలకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చినట్లయింది.
Published date : 11 Jan 2019 01:53PM