జూనియర్ కాలేజీల వేసవి సెలవులు పొడిగింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన ఎండలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కాలేజీలతో పాటు అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి జూన్ 1న ఉత్తర్వులు విడుదల చేశారు.
జూన్ 3 నుంచి కాలేజీలు తెరుచుకోవాల్సి ఉంది. అయితే సెలవుల పొడిగింపు కారణంగా జూన్ 12 నుంచి కాలేజీలు ప్రారంభం అవుతాయని కమిషనర్ పేర్కొన్నారు. అలాగే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఐఐఐటీలు నాలుగు రోజులు ఆలస్యంగా జూన్ 10 తేదీ నుంచి పునఃప్రారంభం అవుతాయని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.గంగయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Published date : 03 Jun 2019 04:32PM