జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో ఇంటర్ హాల్‌టిక్కెట్లు
Sakshi Education
ఏయూ క్యాంపస్ (విశాఖ): ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ పరీక్షల హాల్‌టికెట్లను ఫిబ్రవరి 23 నుంచి జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
విద్యార్థులు నేరుగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని తమ కళాశాల ప్రిన్సిపాల్ సంతకం తీసుకుని పరీక్షకు హాజరుకావచ్చన్నారు. ఫిబ్రవరి 23నఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్‌సలో వివిధ జిల్లాల అధికారులతో ఆయన మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలను సులభంగా గుర్తించడానికి వీలుగా ఐపీఈ సెంటర్ లొకేటర్ పేరుతో ఒక యాప్‌ను రూపొందించామని, గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు.
Published date : 24 Feb 2018 03:44PM