జేఈఈ విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్ లొకేటర్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసంజనవరి 8వ తేదీ నుంచి నిర్వహించనున్న జేఈఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాన్ని తెలుసుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా జేఈఈ మెయిన్ వెబ్‌సైట్‌లో ప్రత్యేక లింకు ద్వారా గూగుల్ మ్యాప్స్ ఆధారిత ఎగ్జామ్ సెంటర్ లొకేటర్‌ను అందుబాటులో ఉంచింది.
Published date : 04 Jan 2019 02:48PM