Skip to main content

జేఈఈ మెయిన్స్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్‌-2017 ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ ప్రక్రియ జనవరి రెండో తేదీ వరకు కొనసాగనుంది.
జేఈఈ దరఖాస్తుల సమర్పణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) గురువారం విడుదల చేసింది. www.jeemains.nic.in అనే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తును, బులెటిన్‌ను అందుబాటులో ఉంచింది. మెయిన్స్‌ అడ్మిట్ కార్డులను 2017 మార్చి రెండో వారం నుంచే వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. మొదటగా జేఈఈ మెయిన్స్‌ పరీక్ష 2017 ఏప్రిల్ 2న ఆఫ్‌లైన్‌లో జరగనుంది. ఆన్‌లైన్ పరీక్ష ఏప్రిల్ 8, 9 తేదీల్లో జరగనుంది. ఏప్రిల్ 18 నుంచి 22 వరకు సమాధాన కీని, ఓఎమ్మార్ షీట్లను అందుబాటులో ఉంచుతారు. జేఈఈ మెయిన్స్‌ పేపర్-2 ఆలిండియా ర్యాంకులను మే 27న ప్రకటిస్తారు.
Published date : 02 Dec 2016 02:29PM

Photo Stories