జేఈఈ దరఖాస్తుల్లో పొరపాట్లు సవరించవచ్చు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఇతర జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లోని ఫొటోల్లో దొర్లిన తప్పిదాలను సరిచేసుకునేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అవకాశం కల్పించింది.
ఇందుకోసం జేఈఈ మెయిన్ ( www.jeemain.nic.in) వెబ్‌సైట్‌లో ప్రత్యేక లింకును ఇచ్చింది. విద్యార్థులు ఆ లింకు ద్వారా తమ దరఖాస్తు ఫారాల్లో అప్‌లోడ్ చేసిన ఫొటోల్లో తేడాలుంటే సరిచేసుకోవాలని సూచించింది.
Published date : 11 Dec 2017 02:24PM