జేఈఈ అడ్వాన్స్డ్ ఇక ఆన్‌లైన్‌లో
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.
ఈ మేరకు జేఈఈ అడ్వాన్స్డ్-2018ను నిర్వహించేందుకు కాన్పూర్ ఐఐటీ ఏర్పాట్లు చేస్తోంది. ఏడు జోనల్ ఐఐటీల సంయుక్త ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం మేరకు పరీక్ష నిర్వహణకు సంబంధించిన చర్యలను మొదలు పెట్టింది. పరీక్షను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నిర్వహించనుంది. అలాగే ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించేందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియపై దృష్టి పెట్టింది.
మెయిన్ మాత్రం ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో..
ప్రస్తుతం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ పరీక్షను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్వహిస్తోంది. 2018లో కూడా జేఈఈ మెయిన్‌ను రెండు విధాలుగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే జేఈఈ అడ్వాన్‌సడ్ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని జోనల్ ఐఐటీలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆఫ్‌లైన్ విధానానికి ఫుల్‌స్టాప్ పడనుంది. ఇప్పటివరకు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాసు, ఐఐటీ గువాహటి నిర్వహించగా, వచ్చే ఏడాది ఐఐటీ కాన్పూర్ నిర్వహించనుంది. 2011లో జేఈఈ పరీక్ష విధానం ప్రవేశపెట్టినపుడు ఐఐటీ కాన్పూర్ ఆ పరీక్షను నిర్వహించింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత కాన్పూర్ నిర్వహించబోతోంది. మరోవైపు జేఈఈ అడ్వాన్స్డ్-2018 పరీక్షను బంగ్లాదేశ్, ఇథియోపియా, నేపాల్, సింగపూర్, శ్రీలంక, దుబాయ్ దేశాల్లోనూ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ప్రశ్నపత్రంలోనూ మార్పులు..
ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రశ్నపత్రంలో పలు మార్పులు తీసుకు రావాలని జోనల్ ఐఐటీ కమిటీ భావిస్తోంది. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతోపాటు షార్ట్ ఆన్సర్స్ ప్రశ్నలను కూడా ఇవ్వాలని భావిస్తోంది. తద్వారా విద్యార్థులను మరింత లోతుగా ప్రశ్నించడం వీల వుతుందని ఐఐటీలు భావిస్తున్నాయి. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల విధానం వల్ల విద్యార్థుల అవగా హనను క్షుణ్ణంగా తెలుసుకోవడం సాధ్యం కావ డం లేదన్న భావన ఎప్పటినుంచో ఉంది. షార్ట్ ఆన్సర్ ప్రశ్నలను కూడా ఇవ్వనున్నట్లు సమాచా రం. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్న ట్లు ఐఐటీ కాన్పూర్ వర్గాలు వెల్లడించాయి. ఆన్‌లైన్ పరీక్షకు సంబంధించిన వివరాలను, జాగ్రత్తల ను విద్యార్థులకు తెలియజేసేందుకు పరీక్ష సమ యంలో ముందుగా 15 నుంచి 20 నిమిషాలు కేటాయించాలని ఐఐటీ వర్గాలు భావిస్తున్నాయి. మొదటిసారిగా ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తు న్న నేపథ్యంలో విద్యార్థులకు అవగాహన అవసర మని ఈ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించాయి.

Published date : 11 Sep 2017 12:20PM