Skip to main content

జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష వాయిదా ?

సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు మే 19న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఏడో విడత ఎన్నికలు ఏప్రిల్ 19న ఉన్న నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 19 నాటి పరీక్షను వాయిదా వేస్తే మే 26న నిర్వహించే అవకాశం ఉంటుందని ఐఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.

మార్చి 11 నుంచి 15 వరకు జేఈఈ ఎడిట్ ఆప్షన్..
జేఈఈ మెయిన్స్-2019కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ దరఖాస్తులోని వివరాల్లో తప్పులు దొర్లితే మార్చి 15లోగా సరిదిద్దుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. www.jeemain.nic.in వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థి పేరు, తల్లి పేరు, తండ్రి పేరులలో మాత్రమే ఎడిట్‌కు అవకాశం ఉంటుందని పేర్కొంది. దీనికి సంబంధించి అదనపు ఫీజును క్రెడిట్/డెబిట్/నెట్ బ్యాంకింగ్ ద్యారా మార్చి 11 నుంచి 16 వరకు చెల్లించాలని తెలిపింది. ఆర్థికంగా వెనుకబాటు తరగతి (ఈడబ్ల్యూఎస్) కేటగిరీకి సంబంధించిన వివరాలను మార్చి 15 లోగా అప్‌డేట్ చేసుకోవాలని పేర్కొంది.
Published date : 12 Mar 2019 02:53PM

Photo Stories