జేఎల్‌ఎం పోస్టుకు బేరసారాలు!
Sakshi Education
అరసవల్లి: జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం) ఉద్యోగాలకు ‘పోల్ క్లైంబింగ్’ పరీక్షలు జరుగుతుండగానే.. ఓ అభ్యర్థి ఫోన్లో దళారీతో బేరసారాలు ఆడుతున్న వైనాన్ని ఈపీడీసీఎల్ విజిలెన్స్ అధికారులు గమనించారు.
పోల్ క్లైంబింగ్ పరీక్షలో పాసైన తర్వాత మెరిట్ జాబితాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ దళారులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 7న శ్రీకాకుళం ఆర్‌ట్స కళాశాల మైదానంలో ఓ అభ్యర్థి దళారీతో ఫోన్లో బేరసారాలు ఆడుతుండగా ఈపీడీసీఎల్ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఫోన్లో మాట్లాడుతున్న ఆమదాలవలస మండలం పొన్నాం గ్రామానికి చెందిన గుండ దుర్గాప్రసాద్ అనే అభ్యర్థిని అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థి దుర్గాప్రసాద్‌ను విజిలెన్స్ సీఐ వై.రామకృష్ణ విచారించి ఎస్‌ఈ రమేష్‌కు అప్పగించారు. అభ్యర్థి నుంచి లిఖిత పూర్వక స్టేట్‌మెంట్ తీసుకుని విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఈపీడీసీఎల్ సీఎండీ ఎస్.నాగలక్ష్మి స్పందిస్తూ...వెంటనే విచారణ చేయాలని అధికారులకు ఆదేశించారు.
Published date : 09 Sep 2019 12:26PM