జాతీయ విద్యా సంస్థల్లో ఉమ్మడి కౌన్సెలింగ్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగుతున్న జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఉమ్మడిగా ప్రవేశాలను చేపట్టేందుకు కసరత్తు మొదలైంది.
ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఆధ్వర్యంలో త్వరలోనే సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీఎస్‌ఏబీ) ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఈనెల 30న జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులను విడుదల చేసేందుకు సీబీఎస్‌ఈ ఏర్పాట్లు చేస్తోంది. అయితే అంతకుముందే సీఎస్‌ఏబీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మరోవైపు ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహించిన ఐఐటీ గుహవటి నేతృత్వంలోనే జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు, ర్యాంకులు విడుదల కావడంతో జేఏబీ ఏర్పాటుకు ఐఐటీ కౌన్సిల్ కసరత్తు చేస్తోంది. సీఎస్‌ఏబీ, జేఏబీల సంయుక్తాధ్వర్యంలో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీని (జోసా) ఏర్పాటు చే సేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 20 లోగానే జోసా ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే తొలుత ఐఐటీల్లో ఈనెల 20న సీట్లు కేటాయింపు ప్రక్రియ కానుంది.
Published date : 14 Jun 2016 01:23PM