Intermediate Examination: ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం
Sakshi Education
గతేడాది, ఈ ఏడాదిలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని ప్రతీ విద్యార్థి వినియోగించుకోవాలని తెలిపింది. అలాగే, వారి పరీక్షలు మళ్ళీ రాసే అవకాశంపై వివరాలను తెలిపారు.
సాక్షి ఎడ్యుకేషన్: ఈ ఏడాది ఫిబ్రవరి/మార్చి, గతే డాది మార్చి నెలల్లో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెలైన విద్యార్థులు వచ్చే ఏడాది పరీక్షలు రాసేందుకు ఈ నెల 30వ తేదీలోపు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి గురవయ్యశెట్టి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
YSRCP Government Education Scheme: జగన్న ప్రభుత్వం అమలు చేసిన విద్యా సాయానికి పథకం
పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ కాలేజీకి వచ్చి చదువుకుని పరీక్షలు రాసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఆయా ప్రాంతాల్లోని కాలేజీ ప్రిన్సిపాళ్లను సంప్రదించాలన్నారు.
Published date : 25 Sep 2023 03:15PM