Inter exams: ఇంటర్ పరీక్షల తేదీలు ఇవే.....
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్ విద్యార్థులకు కొత్త పంథాలో బుధవారం నుంచి క్వార్టర్లీ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలల్లో జిల్లా వ్యాప్తంగా ఒకే ప్రశ్న పత్రంతో విద్యార్థులు పరీక్షలు రాసేలా నిర్ణయించారు. బుధవారం నుంచి నుంచి మొదలుకానున్న త్రైమాసిక(క్వార్టర్లీ) పరీక్షలతో ఈ విధానం అమల్లోకి వచ్చింది.
Download AP Inter 1st Year Study Material
పరీక్షకు ముందు ప్రశ్నపత్రం కాలేజ్ ప్రిన్సిపాల్‌కు చేరుతుంది. ఐడీ, పాస్‌వర్డు ద్వారా క్వశ్చన్‌పేపర్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటౌట్స్ తీసి, కళాశాలల్లో నిర్దిష్టమైన సమయానికి విద్యార్థులకు అందజేసి పరీక్షలను రాయిస్తారు. సెప్టెంబర్ వరకు పూర్తయిన నిర్దేశిత సిలబస్ ప్రకారం రూపుదిద్దుకున్న ఈ ప్రశ్న పత్రాన్ని ఇంటర్ విద్య అధికారుల పర్యవేక్షణలో నిష్ణాతులైన లెక్చరర్లు పారదర్శకంగా, అత్యంత గొప్యంగా తయారుచేసి రూపొందిస్తున్నారు. ఈ పరీక్షలకు జిల్లా ఇంటర్మీడియెట్ విద్య డీవీఈఓ కోట ప్రకాశరావు నేతృత్వంలో ఏర్పాట్లు పకడ్బందీగా, పక్కాగా చేపట్టారు.