ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సుల పుస్తకాల ఆవిష్కరణ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్‌లో వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఆవిష్కరించారు.
సెప్టెంబర్ 27న ఇంటర్మీడియట్ బోర్డులో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు, నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం ఇంటర్మీడియట్ విద్య, పరీక్షలు తదితర అంశాలపై సమీక్షించారు. మెరుగైన ఫలితాల సాధనకు, విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సమావేశంలో తెలుగు అకాడమీ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో తెలుగు అకాడమీ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Published date : 28 Sep 2019 01:52PM