Skip to main content

ఇంటర్మీడియెట్ విద్యార్థులకు గ్రేడ్ల సంకటం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డ్ గ్రేడింగ్ విధానంలో జారీ చేస్తున్న ధ్రువపత్రాలను ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలు అనుమతించట్లేదు.
జూన్ 28న ఢిల్లీలోని ఢిల్లీ వర్సిటీ పరిధిలో డిగ్రీ కళాశాలల కౌన్సెలింగ్‌కు హాజరైన దాదాపు 2 వేల మంది రాష్ట్ర విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. ఈ కాలేజీల్లో సీట్లు పొందాలంటే కనిష్టంగా విద్యార్థులు 96 శాతానికి పైగా మార్కులు సాధించాలి. అయితే మన రాష్ట్రంలో కొత్తగా మార్కులకు బదులు గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి సీజీపీఏలో మార్కుల మెమోలు అందిస్తోంది. ఈ ధ్రువపత్రాలతో వెళ్లిన వేలాది మందికి ఢిల్లీ వర్సిటీ పరిధిలోని కాలేజీలు అడ్మిషన్లు ఇవ్వలేదు. దీంతో తమ సమస్యను పరిష్కరించాలని ఇంటర్ బోర్డుకు విద్యార్థులు కోరుతున్నారు.
Published date : 29 Jun 2019 04:41PM

Photo Stories