Skip to main content

ఇంటర్లో సంస్కరణలకు ఏపీజేఎంఏ మద్దతు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియెట్ విద్యలో ఆన్లైన్ ప్రవేశాలు సహా చేపడుతున్న సంస్కరణలకు ఏపీ ప్రైవేటు అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం (ఏపీజేఎంఏ) మద్దతు ప్రకటించింది.
విద్యా వ్యాపారాన్ని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు అక్టోబర్ 30వ తేదీన ఏపీజేఎంఏ నేతలు చిత్తూరులో సమావేశమై ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు తెలుపుతూ తీర్మానం చేశారు.
Published date : 31 Oct 2020 02:56PM

Photo Stories