ఇంటర్‌లో పలు రుసుములు రద్దు చేసిన ఏపీ ఇంటర్ బోర్డు
Sakshi Education
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితులు చితికిపోయి ఉన్నందున ఇంటర్మీడియెట్‌లో పలు రుసుములు రద్దు చేస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు సోమవారం ప్రకటించింది.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, బోర్డు చైర్మన్ ఆదిమూలపు సురేష్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల నుంచి వసూలు చేసే వివిధ రుసుములు ప్రిన్సిపాళ్లు తీసుకోరాదని స్పష్టం చేశారు.
రద్దయిన రుసుములు ఇలా (ఫీజు రూ.లలో)...
రద్దయిన రుసుములు ఇలా (ఫీజు రూ.లలో)...
కేటగిరీ | ఫీజు |
రీ అడ్మిషన్ | 1,000 |
టీసీ | 1,000 |
సెకండ్ లాంగ్వేజ్ మార్పు | 800 |
మాధ్యమం మార్పు | 600 |
గ్రూపు మార్పు (ఫస్టియర్) | 1,000 |
గ్రూపు మార్పు (సెకండియర్) | 1,000 |
Published date : 15 Dec 2020 02:54PM