Skip to main content

ఇంటర్‌లో పెరిగిన టాప్ మార్కులు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్స ర ఫలితాల్లో ఈసారి టాప్ మార్కులు పెరిగాయి.
గతేడాది ఎంపీసీలో టాప్ మార్కులు 993 కాగా.. ఈసారి 994 వచ్చాయి. బైపీసీలో గతేడాది 991 మార్కులు టాప్‌కాగా.. ఈసారి 992 మార్కులు వచ్చాయి. ఈసారి ఎంపీసీ, బైపీసీ రెండు విభాగాల్లోనూ ఇద్దరు చొప్పున విద్యార్థులు టాప్ మార్కులు సాధించారు. ఇక ఎంఈసీలో గతేడాది 986 అత్యధిక మార్కులు కాగా.. ఈసారి ఒక విద్యార్థికి 987 మార్కులు వచ్చాయి. సీఈసీలో గతేడాది 976 టాప్ మా ర్కులుకాగా.. ఈసారి ముగ్గురు విద్యార్థులు 977 మార్కులు సాధించారు. హెచ్‌ఈసీలో గతే డాది 950 టాప్ మార్కులుకాగా.. ఈసారి 958 టాప్ మార్కులను ఒక్క విద్యార్థి సాధించారు.

ప్రథమ సంవత్సరంలో..
ఇక ప్రథమ సంవత్సరం ఎంపీసీలో గతేడాది 467 టాప్ మార్కులుకాగా.. ఈసారి కూడా 467 మార్కులే టాప్. అయితే గతేడాది టాప్ మార్కులు 12 మందికే రాగా.. ఈసారి 24 మంది విద్యార్థులకు వచ్చాయి. బైపీసీలో గతేడాది 436 టాప్ మార్కులను 11 మంది సాధించగా.. ఈసారి ఏడుగురు 437 టాప్ మార్కులు పొందారు. ఎంఈసీలో గతేడాది ఆరుగురు 493 టాప్ మార్కులు సాధించగా.. ఈసారి ఒక విద్యార్థి 495 టాప్ మార్కులు పొందారు. సీఈసీలో గతేడాది ఒక విద్యార్థి 492 టాప్ మార్కులు పొందగా.. ఈసారి టాప్ మార్కులు తగ్గిపోయాయి. ఒక విద్యార్థి మాత్రమే 490 టాప్ మార్కులు సాధించారు. గతేడాది హెచ్‌ఈసీలో 470 టాప్ మార్కులను ఒక్క విద్యార్థి పొందగా.. ఈసారి ఒక విద్యార్థికి 483 మార్కులు వచ్చాయి.
Published date : 14 Apr 2018 05:32PM

Photo Stories