Skip to main content

ఇంటర్‌లో నిర్ణీత మార్కులుంటేనే ఐఐటీ ప్రవేశం

సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి 2017 విద్యాసంవత్సరం నుంచి జాయింట్ ఎంట్రన్‌‌స ఎగ్జామినేషన్ (జేఈఈ)లో ర్యాంకుతోపాటు ఇంటర్ సెకండియర్ లో 75 శాతం మార్కులు ఉండాలని సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) నిబంధన విధించింది.
2017 నుంచి జేఈఈలో ఇంటర్ మార్కులకు వెయిటేజీని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే వెయిటేజీని రద్దుచేసినప్పటికీ నిర్ణీత శాతంలో మార్కులు సాధించిన వారికి మాత్రమే జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుందనే నిబం ధన విధించింది. ఇంటర్ సెకండియర్లో ఓసీలకు 75 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం మార్కు లు ఉండాలని స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్ కు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైనా వెబ్‌సైట్లో ఆన్‌లైన్ దరఖాస్తు ఓపెన్ కావడం లేదని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణలో ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డు లేని విద్యార్థులు వాటిని పొందేందుకు ప్రత్యేక కేంద్రాలను ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేయిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో 7 పరీక్ష కేంద్రాలు..
ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా 103 కేంద్రాల్లో జరుగుతుంది. విదేశాల్లో పరీక్షలు రాసే వారి కోసం మరో 8 కేంద్రాలు ఆయా దేశాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం... తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోని 31 ఎన్‌ఐటీలు, 20 ఐఐఐటీలు, మరో 19 జాతీయ విద్యాసంస్థల్లోకి ఈ పరీక్షల ఆధారంగా ప్రవేశాలు చేపట్టనున్నారు.
Published date : 03 Dec 2016 11:19AM

Photo Stories