Skip to main content

ఇంటర్‌లో గ్రేడింగ్ విధానం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి చెప్పారు.
ఈ ఏడాది ర్యాంకుల స్థానంలో గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. సచివాలయం పబ్లిసిటీ సెల్‌లో ఫిబ్రవరి 23న ఆమె మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 10,26,891 మంది పరీక్షలకు హాజరవుతున్నారని ప్రకటించారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయని, ఒకరోజు ఫస్టియర్‌కు, మర్నాడు సెకండియర్‌కు ఉంటాయన్నారు. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హాల్‌టికెట్లను https://jnanabhumi.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. హాల్‌టికెట్‌ను సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌తో ధ్రువీకరించుకుని పరీక్షా కేంద్రానికి వెళ్లాలని వివరించారు. ఫీజులు చెల్లించలేదని హాల్ టికెట్లను ధ్రువీకరించని ప్రైవేటు కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాపీరాయుళ్లపై కఠిన చర్యలు..
పరీక్షల్లో కాపీ చేస్తూ పట్టుబడితే తర్వాత 8 పరీక్షల వరకు అనుమతించకుండా డిబార్ చేస్తామన్నారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే 08662974130, ఫ్యాక్స్ నెంబర్ 08662970056, టోల్ ఫ్రీ నెంబర్ 18002749868కు తెలియజేయాలన్నారు.

ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్:

తేదీ

ఫస్టియర్

తేదీ

సెకండియర్

28-2-2018

ద్వితీయ భాష పేపర్-1

1-3-2018

ద్వితీయ భాష పేపర్-2

3-3-2018

ఇంగ్లిష్ పేపర్-1

5-3-2018

ఇంగ్లిష్ పేపర్-2

6-3-2018

మ్యాథమెటిక్స్ పేపర్-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1, సైకాలజీ పేపర్-1

7-3-2018

మ్యాథమెటిక్స్ పేపర్-2ఏ, బోటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2, సైకాలజీ పేపర్-2

8-3-2018

మ్యాథమెటిక్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1

9-3-2018

మ్యాథమెటిక్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2

10-3-2018

ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1, క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్-1

12-3-2018

ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2, క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్-2

13-3-2018

కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్‌‌ట్స, మ్యూజిక్ పేపర్-1

14-3-2018

కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్‌‌ట్స, మ్యూజిక్ పేపర్-2

15-3-2018

జియాలజీ పేపర్-1, హోం సెన్సైస్ పేపర్-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జికోర్సు మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ)

16-3-2018

జియాలజీ పేపర్-2, హోం సెన్సైస్ పేపర్-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జికోర్సు మ్యాథ్స్ పేపర్-2 (బైపీసీ)

17-3-2018

మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియాగ్రఫీ పేపర్-1

19-3-2018

మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జియాగ్రఫీ పేపర్-2

Published date : 24 Feb 2018 03:43PM

Photo Stories