‘ఇంటర్’అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును తెలంగాణ ఇంటర్ బోర్డు పొడిగించింది.
మే 2వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ఫీజు స్వీకరించాలని నిర్ణయించింది. వాస్తవానికి ఏప్రిల్ 29తో ఫీజు గడువు ముగుస్తుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తున్న వినతులను పరిశీలించిన బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఏప్రిల్ 29న ఒక ప్రకటన విడుదల చేసింది. తల్లిదండ్రులు సకాలంలో ఫీజు చెల్లించాలని, ఆ మొత్తాన్ని సంబంధిత ప్రిన్సిపాళ్లు ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేయాలని స్పష్టం చేసింది.
Published date : 30 Apr 2019 03:04PM