ఇంటర్ వొకేషనల్ కాలేజీల గుర్తింపునకు నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని వొకేషనల్ జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు, అదనపు సెక్షన్లు, సీట్ల మంజూరు కోసం ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది.
2019-20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టే కాలేజీలు జనవరి 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. రూ.1000 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 12వ తేదీ వరకు, రూ.3 వేల ఆలస్య రుసుముతో 25వ తేదీ వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో మార్చి 8వ తేదీ వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో మార్చి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలను తమ వెబ్‌సైట్లో పొందవచ్చని తెలిపింది.
Published date : 09 Jan 2019 01:42PM