Skip to main content

ఇంటర్ విద్యార్థులకు కూడా ‘అమ్మ ఒడి’ పథకం వర్తింపు

సాక్షి, అమరావతి : ఆంధ్ర్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా వర్తింస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 27న విద్యాశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ జూనియర్ కాలేజీలతోపాటు హాస్టల్లో ఉంటూ చదివేవారు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఉండే వారికి కూడా ఇకపై అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రటించింది. ఈ పథకం కింద తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ప్రభుత్వం అందజేస్తుంది. మొదటగా కేవలం పదో తరగతిలోపు విద్యార్థులకే ఈ పథకం​అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. సీఎం వైఎస్‌ జగన్‌ కూడా పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇదే హామీ ఇచ్చారు. కానీ జూన్ 27న‌ నిర్వహించని సమీక్ష సమావేశంలో సీఎం జగన్‌ ఈ పథకాన్ని ఇంర్మీడియట్‌ విద్యార్థులకు వర్తింపజేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
Published date : 27 Jun 2019 03:54PM

Photo Stories