Skip to main content

ఇంటర్ ఉత్తీర్ణుల్లో ఏటా సగటున 15% డ్రాపౌట్

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఏటా వేలాది మంది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు.. పదో తరగతి, ఇంటర్ పాసైనా పైచదువులకు వెళ్లకుండా పనిబాట పడుతున్నారు.
ఓవైపు కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఈ పరిస్థితికి కారణంకాగా.. విద్యార్థుల్లో పైచదువులపై అవగాహన లోపం, సామర్థ్యాల లేమి మరో కారణంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఏటా ఇంటర్మీడియెట్ తర్వాత సగటున 15 శాతం మంది చదువు ఆపేస్తుండటం ఆందోళనకరమైన అంశం. విద్యాశాఖ లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

మూడేళ్ల లెక్కలు చూస్తే..
ఇంటర్ పూర్తయ్యాక చదువు మానేస్తున్నవారి శాతం కొన్నేళ్లుగా దాదాపు ఒకే స్థాయిలో ఉంటోంది. 2016-17లో ఉత్తీర్ణులైన మొత్తం ఇంటర్ విద్యార్థుల్లో 14 శాతం మంది డ్రాపౌట్స్‌గా మిగిలిపోగా... 2015-16లో 17 శాతం మంది.. 2014-15లో 15 శాతం మంది పై చదువులకు వెళ్లలేదు.

ఇక పదో తరగతికి వస్తే.. 2016-17 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తయిన వారిలో 4.95 శాతం మంది పైచదువులకు దూరంకాగా.. 2015-16లో 6 శాతం మంది, 2014-15లో 7 శాతం మంది డ్రాపౌట్స్‌గానే మిగిలిపోయారు.

ఇంటర్ తర్వాత భారీగా..
రాష్ట్రవ్యాప్తంగా 2016-17 విద్యా సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 4,14,213 మంది హాజరుకాగా.. అందులో 3,38,903 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 2,91,088 మంది వివిధ కోర్సుల్లో చేరగా.. 47,842 మంది వివిధ కారణాలతో చదువుకు దూరమయ్యారు. ఇక ఇంటర్ తరువాత వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో 1,00,701 మంది చేరగా.. అందులో 10 శాతం మంది ఏపీ సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఉన్నట్లు అంచనా. అంటే 90,631 మంది రాష్ట్రవిద్యార్థులు వివిధ వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారు. ఇక డిగ్రీ కోర్సుల్లో 2,00,457 మంది చేరారు.

2017-18లో ఇంటర్ తరువాత వివిధ కోర్సుల్లో చేరినవారు

కోర్సు

చేరినవారు

బీటెక్

68,593

బీఫార్మసీ

6,500

డీఎడ్

10,200

ఎంబీబీఎస్

3,200

బీడీఎస్

1,400

ఆయుష్

695

అగ్రికల్చర్, వెటర్నరీ

500

జాతీయ విద్యా సంస్థలు, విదేశీ చదువుకు వెళ్లిన వారు

9,612

బీఏలో చేరిన వారు

25,599

బీబీఎం

306

బీబీఏ

1,762

బీసీఏ

336

బీకాం

80,696

బీఎస్సీ

91,702

బీఎస్‌డబ్ల్యూ

36

డిగ్రీ వొకేషనల్

20


ఇంటర్ స్థాయి నుంచి..

సంవత్సరం

పాసైనవారు

పైకోర్సుల్లో చేరింది

డ్రాపౌట్

2014-15

3,49,422

2,97,009

52,413

2015-16

3,52,446

2,92,531

59,915

2016-17

3,38,930

2,91,088

47,842


పదో తరగతి స్థాయి నుంచి..

2014-15

4,44,828

4,13,691

31,137

2015-16

4,37,192

4,10,961

26,231

2016-17

4,80,831

4,57,011

23,820


డ్రాపౌట్స్ తగ్గించేలా చర్యలు చేపట్టాలి..
‘‘పదో తరగతి, ఇంటర్ తరువాత విద్యార్థులు చదువు మానేయడం మంచిదికాదు. కొద్దిగా కష్టపడి చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ప్రభుత్వం కూడా డ్రాపౌట్లను తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి..’’
- ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ పి.మధుసూదన్‌రెడ్డి
Published date : 24 Nov 2017 03:16PM

Photo Stories