ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు జూన్ 15న ఎంసెట్ ర్యాంకులు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎంసెట్ ర్యాంకులను జూన్ 15న ప్రకటించనున్నామని కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఏపీ, తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ద్వారా 5,137 మందికి ఇంజనీరింగ్ విభాగంలో, 1,600 మందికి అగ్రి, మెడికల్ విభాగంలో ర్యాంకులు కేటాయిస్తామన్నారు. విద్యార్థుల ర్యాంకులను వారి మొబైల్ నెంబర్లకు సంక్షిప్త సందేశాల ద్వారా తెలియజేస్తామన్నారు. సందేహాలున్న వారు 0884-2340535, 2356255 నెంబర్లకు లేదా apeamcet18@gmail.comలో సంప్రదించవచ్చని తెలిపారు.
Published date : 15 Jun 2018 02:08PM