ఇంటర్ సిలబస్‌ను మార్చాల్సిన అవసరం లేదు: నిపుణుల కమిటీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియెట్ సిలబస్‌లో ఫిజిక్సు, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ అంశాలు జాతీయ అర్హత, ప్రవేశపరీక్ష (నీట్) సిలబస్ కన్నా మించి ఉన్నాయని నిపుణుల కమిటీ తేల్చింది.
ఇంటర్మీడియెట్ సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని, నీట్‌కు అనుగుణంగా ప్రశ్నలతో తయారుచేసిన క్వశ్చన్‌బ్యాంక్‌ను విద్యార్థులకు అందజేయాలని సూచించింది. ప్రాక్టికల్స్ మాన్యువల్‌ను పూర్తిగా మార్చాలని సిఫార్సు చేసింది. ఈ సూచనలపై బుధవారం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో నిర్వహించే సమావేశంలో పూర్తి స్పష్టత రానుంది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ఎంబీబీఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు ‘నీట్’ తప్పనిసరి కావడంతో అందుకు అనుగుణంగా ఇంటర్మీడియెట్ సిలబస్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులకు విద్యారంగ నిపుణులతో ఓ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఇంటర్, సీబీఎస్‌ఈ సిలబస్‌లను, నీట్‌లోని ప్రశ్నలను క్షుణ్నంగా పరిశీలించి నివేదిక సిద్ధం చేసింది. అనంతరం ఈ కమిటీతో ఇంటర్మీడియెట్‌బోర్డు సమావేశమై చర్చించింది. కమిటీలోని ప్రభుత్వ, కార్పొరేట్ కాలేజీల ఫిజిక్సు, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ లెక్చరర్లతో పాటు వివిధ విశ్వవిద్యాలయాల నిపుణులు పాల్గొని సూచనలు చేశారు. ఆయా సబ్జెక్టుల్లో చేయాల్సిన మార్పులు చేర్పులపై సిఫార్సులు అందించారు. వీటిని అనుసరించి మార్పులు చేయనున్నారు. సిలబస్ మార్పుచేర్పులపై కమిటీ సూచనలివీ...
ఫిజిక్సులో.... ఇంటర్, నీట్ సిలబస్‌లు దాదాపు సమానం. చేర్పులు, తొలగింపులు అవసరం లేదు. నీట్‌లో లేని ‘కమ్యూనికేషన్ సిస్టమ్’ టాపిక్ ఇంటర్ సిలబస్‌లో ఉంది. ఇంటర్‌లో ప్రశ్నలు నీట్ మాదిరి కఠినంగా లేవు. కాబట్టి ప్రతి పాఠం వెనుక గ్రాఫికల్, లాజికల్, కాన్సెప్టు, రీజనింగ్‌లతో కూడిన లోతైన ప్రశ్నలివ్వాలి. ట్రిగ్నోమెట్రీ, లాగరిథమ్స్ అంశాలు ప్రవేశపెట్టాలి. ప్రాక్టికల్స్‌కు సిలబస్‌ను సీబీఎస్‌ఈకి అనుగుణంగా, ప్రశ్నల ప్యాట్రన్‌ను నీట్‌కు సరిపోయేలా మార్చాలి.
కెమిస్ట్రీలో... ఇంటర్, నీట్ సిలబస్‌లు సమానంగా ఉన్నాయి. మరింత లోతైన ప్రశ్నలు రూపొందించి, ప్రతి పాఠం వెనుక వీటిని సోదాహరణంగా ఇవ్వాలి. ప్రత్యేక ప్రాక్టికల్ మాన్యువల్ రూపొందించాలి.
బోటనీ, జువాలజీలో... ఇంటర్ సిలబస్‌లో స్వల్ప మార్పు చేర్పులు చేయాలి. సప్లిమెంటరీ మెటీరియల్ అందుబాటులో ఉంచి, ప్రాక్టికల్ మాన్యువల్‌ను నీట్, ఎన్‌సీఈఆర్టీకి అనుగుణంగా అభివృద్ధిచేయాలి. ప్రతి పాఠం వెనుక నీట్‌కు అనుగుణంగా లోతైన తరహాలో ప్రశ్నలు రూపొందించాలి.
నీట్‌పై క్వశ్చన్ బ్యాంక్
ప్రస్తుత విద్యాసంవత్సరానికి పాఠ్యపుస్తకాల ముద్రణ దాదాపు పూర్తికావస్తున్నందున కమిటీ సూచన మేరకు నీట్‌కు అనుగుణంగా ప్రశ్నల బ్యాంకును వేరేగా ముద్రించి విద్యార్థులకు అందించనున్నారు. వీటిని ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యార్థులకు సర్కారే అందిస్తుంది. జూలై 24న నీట్ పరీక్ష జరగనుండటంతో ఈలోగా మోడల్ క్వశ్చన్ పేపర్లను నిపుణులతో రూపొందించి వెబ్‌సైట్లలో విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నారు.

Published date : 15 Jun 2016 04:30PM