ఇంటర్ ఫలితాల తేదీని ప్రకటించలేదు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాల విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ ఏప్రిల్ 13న ఓ ప్రకటనలో తెలిపారు.
ఫలితాల విడుదల ప్రక్రియ తుది దశకు చేరుకుందని, పూర్తై తర్వాత తేదీని బోర్డు అధికారికంగా ప్రకటిస్తుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని సూచించారు.
Published date : 15 Apr 2019 02:17PM