ఇంటర్ పరీక్షలు... పాటించాల్సిన ప్రధాన జాగ్రత్తలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 4 నుంచి 23 వరకు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
మొదటిరోజు ప్రథమ సంవత్సర పరీక్షలు ద్వితీయ భాష పేపర్‌తో ప్రారంభం కానుండగా, 5 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ద్వితీయ భాష పేపర్‌తో ప్రారంభం కానున్నాయి. పరీక్ష సమయం కంటే నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని, విద్యార్థులు వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. ఉదయం 8 గంటల కల్లా కేంద్రానికి చేరుకోవాలని, 8.30 గంటలకు పరీక్ష హాల్‌లో విద్యార్థులు తమ సీట్లలో కూర్చోవాలని పేర్కొంది. పరీక్ష 9 గంటలకు ప్రారంభం అవుతుందని, ఆలోగా విద్యార్థులంతా పరీక్ష హాల్‌లో ఉండా లని చెప్పింది. నిర్ణీత సమయానికి మించి ఆలస్యమైతే అనుమతించేది లేదని స్పష్టం చేసింది. విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని తెలిపింది. ఈ పరీక్షలకు మొత్తం 9,65,875 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. బుధవారం ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,80,531 మంది విద్యార్థులు హాజరు కానుండగా, అందులో 2,36,430 బాలురు, 2,44,101 మంది బాలికలు హాజరు కానున్నారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 4,85,345 మంది విద్యార్థులు హాజరు కానుండగా, అందులో 2,46,378 మంది బాలురు, 2,38,966 మంది బాలికలు పరీక్షలకు హాజరు కానున్నారు.
ఆర్టీసీ ఉచిత ప్రయాణం
ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం (నేడు) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఉచిత ప్రయాణం కల్పించనుంది. ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణించాలనుకునే విద్యార్థులు ఇంటర్ హాల్‌టికెట్, టీఎస్‌ఆర్టీసీ జారీ చేసిన ఏదైనా రూట్ బస్‌పాస్‌ను చూపించాలని, లేదంటే అనుమతించరని తెలిపింది. అలాగే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించాలనుకునేవారు అదనంగా రూ.20 కాంబినేషన్ టికెట్ కొనాలని టీఎస్‌ఆర్టీసీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
పాటించాల్సిన ప్రధాన జాగ్రత్తలు..
ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయండి
ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా, భయానికి లోనుకాకుండా ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని కోరారు. సరైన ప్రణాళికతో పరీక్షలకు సిద్ధమై, బంగారు భవితకు బాటలు వేసుకోవాలని సూచించారు. సమయానికంటే ముందే పరీక్ష కేంద్రం చేరేలా చూసుకోవాలని కోరారు. భయం, ఆందోళన, ఒత్తిడికి గురైనట్లు ఎవరైనా విద్యార్థులు భావిస్తే ఇంటర్మీడియెట్ బోర్డు నియమించిన సైకాలజిస్టులను ఫోన్‌లో (7337225803) సంప్రదించి, సలహాలు తీసుకోవాలని సూచించారు.

- సెంటర్ లొకేటర్ యాప్ సహకారంతో పరీక్ష కేంద్రానికి చేరుకోవచ్చు. అందులో చూపించే సమయం కన్నా అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
- ఉదయం 9 గంటలలోపు పరీక్ష హాల్లో ఉండాల్సిందే. ఆ తర్వాత అనుమతించరు.
- వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌ను ఇన్విజిలేటర్‌కు అప్పగించి, వారి నుంచి జవాబు బుక్‌లెట్, ఓఎంఆర్ బార్‌కోడ్ షీట్ తీసుకోవాలి. హాల్‌టికెట్ లేకుండా పరీక్ష హాల్లోకి అనుమతించరు.
- జవాబుల బుక్‌లెట్‌లో 24 పేజీలు ఉన్నాయా.. లేదా చూసుకోవాలి. ఏమైనా తేడా ఉంటే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లి, మార్చుకోవాలి.
- హాల్‌టికెట్‌లో పేర్కొన్నట్లుగా సరైన సబ్జెక్టు ప్రశ్నపత్రాన్ని తీసుకోవాలి.
- పశ్నపత్రంపై హాల్‌టికెట్ నంబర్ మాత్రమే రాయాలి.
- విద్యార్థి సంతకం, జవాబు పత్రం నంబరు ఫొటో ఐడెంటిటీ షీట్‌లో రాయాలి.
- పరీక్షలు రాసేందుకు బ్లూ/బ్లాక్ బాల్‌పెన్ మాత్రమే వినియోగించాలి.
- మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు అప్పగించి, హాల్‌టికెట్‌ను తీసుకోవాలి.
- మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష హాల్‌కు తీసుకెళ్లొద్దు.
- పశ్నపత్రం, హాల్‌టికెట్‌పై ఏమీ రాయకూడదు.
- పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌తో, మరే ఇతర అధికారులతో తప్పుగా ప్రవర్తించొద్దు.
- మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి.
- విద్యార్థులకు ఏమైనా సమస్యలు తలెత్తితే ఫోన్ చేసేలా కంట్రోల్ రూం (040-24600110, 040-24732369)ను ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాటు చేసింది.
ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయండి
ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా, భయానికి లోనుకాకుండా ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని కోరారు. సరైన ప్రణాళికతో పరీక్షలకు సిద్ధమై, బంగారు భవితకు బాటలు వేసుకోవాలని సూచించారు. సమయానికంటే ముందే పరీక్ష కేంద్రం చేరేలా చూసుకోవాలని కోరారు. భయం, ఆందోళన, ఒత్తిడికి గురైనట్లు ఎవరైనా విద్యార్థులు భావిస్తే ఇంటర్మీడియెట్ బోర్డు నియమించిన సైకాలజిస్టులను ఫోన్‌లో (7337225803) సంప్రదించి, సలహాలు తీసుకోవాలని సూచించారు.
Published date : 04 Mar 2020 02:47PM