Skip to main content

ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వచ్చే ఏడాది మార్చి మొదటి వారంలో జరగనున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల ఫీజు గడువును నవంబర్ 3 వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం(నేడు)తో ముగియాల్సిన ఫీజు గడువును విద్యార్థుల సౌలభ్యం కోసం పొడిగించినట్లు పేర్కొన్నారు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు 3వ తేదీ వరకు విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు తీసుకోవాలని తెలిపారు. దానిని బోర్డు అకౌంట్‌లో 4వ తేదీ లోగా జమచేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Published date : 28 Oct 2016 04:24PM

Photo Stories