ఇంటర్ పరీక్ష ఫీజు దరఖాస్తు గడువు నవంబర్ 7వరకు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు పరీక్ష ఫీజును నవంబర్ 7వ తేదీ వరకు చెల్లించవచ్చని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఫీజు చెల్లింపు గడువు గత నెలలోనే ముగిసినా పొడిగించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు రూ. 100 ఆలస్య రుసుముతో నవంబర్18 వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో నవంబర్28 వరకు, రూ. 1,000 ఆలస్య రుసుముతో డిసెంబర్9 వరకు, రూ. 2 వేల ఆలస్య రుసుముతో డిసెంబర్ 17 వరకు ఫీజు చెల్లించవచ్చని వెల్లడించారు.
ఇంటర్ ప్రిపరేషన్ కొరకు క్లిక్ చేయండి
కొన్ని ప్రైవేటు కాలేజీలు నిర్ణీత పరీక్ష ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఏదైనా కాలేజీ యాజమాన్యం ఎక్కువ ఫీజు వసూలు చేస్తే జిల్లాల్లోని ఇంటర్మీడియెట్ విద్యాధికారులు/నోడల్ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎక్కువ ఫీజులు వసూలు చేసే యాజమాన్యాలపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
కోర్సుల వారీగా పరీక్ష ఫీజు వివరాలు

- పథమ సంవత్సరం సైన్స్, ఆర్‌ట్స విద్యార్థులకు రూ.470
- ద్వితీయ సంవత్సరం ఆర్‌ట్స విద్యార్థులకు రూ. 470
- ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ (రూ.180)తో కలిపి మొత్తం రూ. 650
- పథమ, ద్వితీయ సంవత్సరం వొకేషనల్ విద్యార్థులకు (ప్రాక్టికల్స్ లేకుండా) రూ. 470
- పథమ, ద్వితీయ సంవత్సరం వొకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ (రూ.180)తో కలిపి రూ.650.
Published date : 06 Nov 2019 05:05PM