Skip to main content

ఇంటర్ ప్రాక్టికల్స్‌లో ఎగ్జామినర్లు కూడా జంబ్లింగ్

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షల్లో అమలు చేస్తున్న జంబ్లింగ్ విధానాన్ని..
పరీక్షల పర్యవేక్షకులుగా ఉండే ఎగ్జామినర్లకూ వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాక్టికల్స్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. జనవరి 9న విజయవాడలో ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కంప్యూటర్ ద్వారా మానిటరింగ్ చేయాలని సూచించారు.
Published date : 10 Jan 2018 01:41PM

Photo Stories