ఇంటర్ ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు పూర్తి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి 1 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు జనవరి 29న ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,33,480 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొంది. ప్రతి రోజు 4 దశల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇంటర్ ప్రథమ సంవత్సర ఎంపీసీ విద్యార్థులు 1,66,364 మంది, బైపీసీ విద్యార్థులు 91,745 మంది, జాగ్రఫీ విద్యార్థులు 422 మంది, ప్రథమ సంవత్సర వొకేషనల్ విద్యార్థులు 40,365 మంది, ద్వితీయ సంవత్సర వొకేషనల్ విద్యార్థులు 34,584 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించింది. 6,410 మంది లెక్చరర్లను ప్రాక్టికల్ ఎగ్జామినర్లు వేశామని, వారి కాలేజీల్లో వారు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొంది. ప్రాక్టికల్ ప్రశ్న పత్రాన్ని ఆన్‌లైన్ ద్వారా https://tsbie.cgg.gov.in పంపనున్నట్లు తెలిపింది. పరీక్ష సమయానికి అరగంట ముందు ప్రాక్టికల్ ఎగ్జామినర్ మొబైల్‌కు వచ్చే పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ప్రశ్న పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. పరీక్ష ముగిసిన రోజే విద్యార్థుల మార్కులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది.
పర్యావరణ విద్య పరీక్షకు 3.26 శాతం గైర్హాజరు :
రాష్ట్రవ్యాప్తంగా జనవరి 29న నిర్వహించిన పర్యావరణ విద్య పరీక్షకు 3.26 శాతం మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు బోర్డు తెలిపింది. 4,61,844 మందికి గాను 4,46,804 పరీక్షకు హాజరయ్యారని, 15,040 మంది గైర్హాజరయ్యారని పేర్కొంది.

Published date : 30 Jan 2018 12:55PM