ఇంటర్ హాస్టల్స్ గుర్తింపు కోసం ఏప్రిల్ 5 నుంచి దరఖాస్తులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు నిర్వహించే కాలేజీ హాస్టళ్ల గుర్తింపు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
ఈ మేరకుమార్చి 31న నోటిఫికేషన్ జారీచేసింది. యాజమాన్యాలు ఏప్రిల్ 5 నుంచి https://acad.tsbie, telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నేరుగా అందజేసే దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకునే యాజమాన్యాలు నిర్ణీత ఫీజు చెల్లించాలని, ఫీజు వివరాలు తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొంది. ఏప్రిల్ 15లోగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. అలాగే రూ.10 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 వరకు, రూ.20 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. మరిన్ని వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపింది. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు నిర్వహించే హాస్టళ్లకు గుర్తింపు పొందాల్సిందేనని ఇంటర్ బోర్డు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Published date : 02 Apr 2018 03:27PM