Skip to main content

ఇంటర్ ఆలస్య రుసుము గడువు పెంపు

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు ఆలస్య రుసుము గడువును పొడగించినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది.
రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. పరీక్ష ఫీజును ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్‌బీఐఈ) కు చెల్లించవచ్చని కార్యదర్శి ఎ.అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.
Published date : 27 Apr 2018 03:39PM

Photo Stories