ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీని ఏప్రిల్ 29 వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది.
విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. పాస్ అయిన విద్యార్థుల జవాబు పత్రాల రీ-వెరిఫికేషన్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం ఏప్రిల్ 27 చివరి తేదీ అని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
Published date : 27 Apr 2019 03:11PM