ఇక జంబ్లింగ్‌లోనే ఇంటర్ ప్రాక్టికల్స్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 2016-17 విద్యాసంవత్సరం నుంచి జంబ్లింగ్ విధానం అమల్లోకి రానుంది.
ఈ మేరకు అన్ని కాలేజీలకూ ఇంటర్మీడియెట్ బోర్డు ద్వారా విద్యాశాఖ ఆదేశాలు జారీచేయించింది. ఇప్పటికే రాష్ట్రంలోని 761 కాలేజీల్లో ల్యాబ్ వసతులు ఉన్నట్లు గుర్తించిన ఇంటర్మీడియెట్ బోర్డు వీటిలో 500 కళాశాలలను ప్రాక్టికల్ పరీక్షలకు కేంద్రాలుగా ప్రకటించనుంది. మిగిలిన వాటిలో ప్రాక్టికల్స్ తరగతుల బోధనకు సరైనవిగా గుర్తించింది. పరీక్ష కేంద్రాలపై పది రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది.
Published date : 15 Jun 2016 04:35PM