ఇక ఇంటర్, డిగ్రీలలో ద్వితీయ భాషగా ‘సంస్కృతం’.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ డిగ్రీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెడుతూ ఈ మధ్య ఇచ్చిన సర్క్యులర్‌పై దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు వెనక్కు తగ్గినప్పటికీ తిరిగి ఉత్తర్వులు జారీచేశారు. సంస్కృతం ప్రవేశపెట్టడం వల్ల ఎన్ని లెక్చరర్ పోస్టులు ఎక్కడ అవసరమో, వాస్తవ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థికశాఖ ఇచ్చిన నమూనా ప్రకారం వివరాలు పంపించాలని తాజా ఉత్తర్వులో సంబంధిత అధికారులను సర్కారు ఆదేశించింది.
చదవండి: పోలీసు పోటీ పరీక్షలకు నేటి నుంచి ‘టి సాట్’లో ప్రసారాలు
చదవండి: జేఈఈలో 95 శాతం మంది ప్రాధాన్యం ఇంగ్లిష్ మాధ్యమానికే.. మాతృభాషపై అనాసక్తి..!!
చదవండి: పోలీసు పోటీ పరీక్షలకు నేటి నుంచి ‘టి సాట్’లో ప్రసారాలు
చదవండి: జేఈఈలో 95 శాతం మంది ప్రాధాన్యం ఇంగ్లిష్ మాధ్యమానికే.. మాతృభాషపై అనాసక్తి..!!
Published date : 06 Aug 2021 03:40PM