ఈ పద్ధతిలోనే ఇంటర్ ప్రవేశాలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో సీట్ల కుదింపుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 23ను హైకోర్టు రద్దు చేసింది.
మరోవైపు ఇంటర్మీడియెట్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి పాత పద్ధతినే అనుసరించాలని ఆదేశించింది. అయితే క్షుణ్ణంగా అధ్యయనం చేసి కొత్త విధానాన్ని రూ పొందించే వెసులుబాటును ప్రభుత్వానికి కల్పించింది. కొత్త విధానాన్ని అనుసరించే ముందు మీడియా ద్వారా విసృ్తతంగా ప్రచారం చేయాలని సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు చేపట్టాలంటే నిర్దిష్ట విధి విధానాలను రూపొందించుకుని చేపట్టవచ్చని పేర్కొంది. ప్రెస్ నోట్ జారీ చేసి దాని ఆధారంగా ఆన్‌లైన్ ప్రవేశాలు చేపడతామంటే కుదరదని స్పష్టం చేసింది. ఇక డిగ్రీ కోర్సుల ప్రవేశాలను ఆన్‌లైన్ ద్వారా చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు నిర్దిష్ట విధి విధానాలు, నిబంధనలతో ప్రభుత్వం జీవో జారీ చేసిందని గుర్తు చేసింది. డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల విషయంలో జోక్యం చేసుకోబోమని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు గురువారం తీర్పు వెలువరించారు.
విద్యా వ్యాపారాన్నిఅరికట్టేందుకే..
విద్యా వ్యాపారాన్ని అరికట్టడం, తగినన్ని మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం జీవో 23 జారీ చేసిందని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు.
విద్యా వ్యాపారాన్నిఅరికట్టేందుకే..
విద్యా వ్యాపారాన్ని అరికట్టడం, తగినన్ని మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం జీవో 23 జారీ చేసిందని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు.
Published date : 25 Dec 2020 03:31PM