Skip to main content

Holidays: తెలంగాణ విద్యార్థులకు షాక్‌... ఒక్క రోజే సంక్రాంతికి సెలవు

హాలిడేస్‌ అంటే చాలు విద్యార్థులు ఎగిరిగంతేస్తారు. పుస్తకాల పఠనంలో విసుగెత్తిపోయిన పిల్లలకు హాలిడేసే రిలాక్స్‌ని ఇస్తాయనడంలో సందేహం లేదు.
Holidays

కొత్త ఏడాది వస్తోంది అంటే ఉద్యోగస్తులు, విద్యార్థులు మొదట చూసేది కేలండర్‌నే. ఎందుకంటే ఆ ఏడాది ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో, ఏ నెల ఎన్ని సెలవులు వస్తాయో లెక్కేసుకుని సంతోషిస్తారు. కానీ, ఈ నూతన ఏడాది మాత్రం వారికి షాక్‌ల మీద షాక్‌లను ఇస్తోంది. చాలా పండుగలు సెలవు రోజులైన రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఇచ్చే హాలిడేస్‌ను కోల్పోవాల్సి వచ్చింది. 

చ‌ద‌వండి: సార్‌... గ్రూప్‌–1 ఫలితాలు ఎప్పుడో చెప్పండి
మూలిగే నక్కమీద తాటిపండుపడ్డ చందంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు తాజాగా ఇంకో షాక్‌ ఇచ్చింది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంటర్మీడియెట్‌ కాలేజీలకు, గురుకులాలకు ఈ నెల 14 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ సందర్భంగా ఆ 3 రోజులే సెలవులు ఇచ్చారు. గవర్నమెంట్, ప్రైవేట్, ఎయిడెడ్, కో ఆపరేటివ్, రెసిడెన్షియల్, కేజీబీవీ కాలేజీలన్ని ఈ నెల 17న తిరిగి రీఓపెన్‌  చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే 14వ తేదీ రెండో శనివారం, 15న ఆదివారం ఇవి సాధారణంగా సెలవు రోజులే. ప్రభుత్వం కేవలం 16వ తేదీ సోమవారం మాత్రమే సెలవు ఇచ్చినట్లైందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చ‌ద‌వండి: ప్రజల చేతికి ప్రభుత్వమే తుపాకులు.... ఇప్ప‌టికే 5 వేల మంది రిజిస్ట్రేష‌న్‌...
అలాగే రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలలకు మాత్రం అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం..  ఈ నెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవలు ప్రకటించింది తెలంగాణ సర్కార్‌.  అయితే.. ఈ సారి సంక్రాంతి పండుగ సండే, భోగి సెకండ్‌ సాటర్‌ డే రోజు రావడంతో స్టూడెంట్స్, గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ నిరాశలో ఉన్నారు. సంక్రాంతికి స్పెషల్‌ హాలిడేస్‌ కోల్పోయామనే బాధ చాలా మందిలో ఉంది. జనవరి 1ని నార్మల్‌ హాలి డే కింద పరిగణించింది ప్రభుత్వం. కానీ ఆ రోజు కూడా ఆదివారం ఖాతాలోకి వెళ్లింది.
వీకెండ్‌ ఎగ్జామ్స్‌ తప్పనిసరి కాదు
టెన్త్‌ క్లాస్‌ స్టూడెంట్స్‌కు ఆదివారం లేదా రెండో శనివారాల్లో వీకెండ్‌ ఎగ్జామ్స్‌ పెట్టాలని  ఇటీవల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సెలవు రోజుల్లో వాటిని జరపాలని టీచర్స్‌ బలవంతం చేయొద్దని సూచించింది.

Published date : 08 Jan 2023 05:54PM

Photo Stories