గురుకుల ఇంటర్మీడియేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2020కు తుదిగడువు జనవరి 23
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 164 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తు గడువును గురువారం (23వ తేదీ) వరకు పొడిగించినట్టు గురుకుల విద్యాలయాల సొసైటీ అధికారులు జనవరి 22 (బుధవారం)నచెప్పారు.
బాలయోగి గురుకుల ఇంటర్మీడియేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2020 ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంట్రెన్స్ టెస్ట్ ఫిబ్రవరి 2న జరగనుండగా, ఫిబ్రవరి 7న ఫలితాల ప్రకటన, ఫిబ్రవరి 7 నుంచి 20 వరకు సీట్లు కేటాయింపు ఉంటుంది. సంవత్సరాదాయం రూ.లక్షలోపు ఉన్నవారు అర్హులు. ఇంటర్ చదువుతూనే ఐఐటీ, నీట్ కోచింగ్ తీసుకోవాలనుకున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి మార్చి ఒకటో తేదీన పరీక్ష నిర్వహించి.. మార్చి 20న ఫలితాలు ప్రకటిస్తారు. తరగతులు జూన్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతాయి. విద్యార్థి వయస్సు 2020 ఆగస్టు 31 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు ఓ ఏడాది మినహాయింపు ఉంటుంది.
Published date : 23 Jan 2020 02:29PM