ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షకు 3.54 శాతం గైర్హాజరు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సర విద్యార్థులకు జనవరి 28న నిర్వహించిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షకు 17,500 మంది (3.54 శాతం) విద్యార్థులు గైర్హాజరు అయ్యారు.
ఈ పరీక్షలు రాసేందుకు 4,94,529 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా ఇందులో 4,77,029 మంది మాత్రమే హాజరయ్యారు. పరీక్ష పూర్తయిన తర్వాత విద్యార్థుల మార్కులను ఆన్‌లైన్‌లో సాయంత్రంలోగా అప్‌లోడ్ చేయాల్సి ఉండగా, సాంకేతిక సమస్యలతో అప్‌లోడ్ చేయలేదు. అప్‌లోడ్ చేసే సమయంలో మార్కుల వివరాలు తప్పుగా వస్తుండటంతో సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు, మార్కుల అప్‌లోడ్ గడువును మరో రెండు రోజులు పొడిగించినట్లు తెలిసింది.
Published date : 29 Jan 2019 02:38PM